పిన్ని అనబడే వరలక్ష్మి గారు, అనే పిచ్చి రాముడి కథ!
Harshaneeyam - A podcast by Harshaneeyam
Categorie:
మన పిచ్చి రాముడు గారు రాసిన, 'అమ్మ గురించి' చదవగానే, ఆయన్ని ఆయన ఒక అమాయకుడి గా చిత్రీకరించు కొని, వాళ్ళ అమ్మ గారు "నా పిచ్చి తండ్రి" అని ఎలా పిలుచుకునేదో, ఎలా కాపాడుకొని కడుపులో దాచుకొనేదో అని రాసిన విధానం నా మనస్సుకు చాలా హత్తుకున్నది. అలాగే ఉమ్మడి కుటుంబం లో పెరిగిన నాకు నా పిన్నమ్మతో అనుబంధం చాలా ఎక్కువ. ఎంత అంటే ఆవిడ జ్ఞాపకాలు అన్నిటా గుది గ్రుచ్చి, "మన జీవితాల్లో కథ నాయికా నాయకులు" అని ముచ్చటలు చెప్పుకునేంత. నాకు ఆయన రాసిన "పిన్ని అనే వరలక్ష్మి గారు" గురించి ఆవిడ కథానాయకుడికి ఏవిధంగా పిన్ని వరస అవుతారో అని ఆవిడ వ్యక్తిత్వం దెబ్బ తినకుండా సున్నితం గా చెప్పిన విధానం ఇంకా నచ్చింది. అందుకే ఆ కథని, మా హర్షాతిథ్యం లో మా ద్వితీయ కథలాగా పరిచయం చేయాలని ఆయన అనుమతితో ప్రయత్నించాము. ఈ ప్రయత్నం లో కొత్త తనము ఆ కథని శ్రవణ రూపం లో తీసుకొని రావటం. బహుశా మా ఈ ప్రయత్నం మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాము. ఈ ప్రయత్నం వెనక మా స్వార్థం కూడా వుందండోయి, మంచి కథలకు మా హర్షాతిథ్యం ఒక వేదిక కావాలని.
