'హెడ్ మాస్టారు ' పాలగుమ్మి పద్మరాజు గారి రచన!

Harshaneeyam - A podcast by Harshaneeyam

Podcast artwork

Categorie:

న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ అంతర్జాతీయ కథా అవార్డు గ్రహీత, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత ప్రముఖ రచయిత పాలగుమ్మి పద్మరాజు గారు రాసిన ‘హెడ్ మాస్టారు ’ కథ , పాలగుమ్మి పద్మరాజు రచనలు – మొదటి వాల్యూమ్ లోనిది . పుస్తకం కొనడానికి కావాల్సిన web linkPalagummi Padmaraju Rachanalu -Vol1కథను మీకందించడానికి అనుమతినిచ్చిన పాలగుమ్మి సీత గారికి కృతజ్ఞతలు.ఎపిసోడ్లో ముందుగా కథ గురించి పాలగుమ్మి సీత గారు మాట్లాడతారు.హర్షణీయం’ పాడ్కాస్ట్ ని ‘గానా’ (Ganaa) అప్ ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam (Harshaneeyam on Spotify)ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5 (Harshaneeyam on Apple. Podcast)హెడ్ మాస్టారు“హెడ్ మాస్టారు పోయారు -”తంతి చదువుకున్నాడు. కెప్టెన్ రావు. క్షణం సేపు అలాగే నిలబడిపోయాడు, పరధ్యానంగా. జేబురుమాలు, పర్సు అందించడానికి వచ్చిన భార్య, బొమలు ముడివేసి అతని వంక చూసింది. వంగి తంతి చదివింది.“ఎవరీ హెడ్ మాస్టరు?” “మా హెడ్ మాస్టారు.”ఆమె భుజాలు అక్కళించి జేబు రుమాలు, పర్సు బల్లమీద పెట్టి లోపలికి వెళ్ళడానికి తిరిగింది. రావు పరధ్యానంగా అలాగే నిలబడ్డాడు. అతని కళ్లలో వెనకటి స్మృతులు తడిగా మెరిశాయి.ఇసుకతిన్నెలు గోదావరిని దూరంగా జరిపేశాయి. గట్టుమీదినించి చూస్తే గోదావరి కొనఊపిరితో మెల్లగా అంతిమయాత్ర చేస్తున్నట్టు, నీరసంగా ఏదో గమ్యం చేరుకోడానికి పాకలేక పాకలేక పాకుతున్నట్టు అనిపించేది. కానీ ఇసుక తిన్నెలు దాటి నీటి అంచుకి చేరుకునేసరికి గోదావరి నిండు ప్రాణంతో ఉత్సాహంగా సాగుతున్నట్టు అనిపించేది. హెడ్ మాస్తారు. అదే రేవులో మొలలోతు నీళ్ళలో నిలబడి ప్రతి ఉదయం సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేవాడు. రావు – అప్పుడతని పేరు సుబ్బారావు – కృష్ణయ్య, రామనాధం, సాంబు, రవి ఫర్లాంగు వెడల్పు నదిని ఈది, అవతలి తిప్పమీదికి పోయేవారు. అక్కడ దోసపాదుల మధ్య వాళ్లు దాచుకున్న ఉప్పూకారం పొట్లాలుండేవి. దోసకాయలు చేతులతోటే చిదిపి, ఉప్పుకారం అద్దుకు తినేవారు. వాళ్ళు పారేసిన దోసగింజల్లోంచి ఎన్నో కొత్త పాదులు మొలిచేవి. నీటి అంచుదాకా అల్లుకుపోయేవి దోసపాదులు. తిరిగి ఈదుకు వచ్చేసరికి హెడ్ మాస్టారి సంధ్యావందనం పూర్తయేది.“ఏరా? కిష్కింధాపురి అగ్రహారికులు ఏ తోటలు తగలబెట్టొచ్చారు? దోసకాయలా? పుచ్చకాయలా?” అని అడిగారొకనాడు. కుర్రాళ్లంతా బిత్తరపోయారు. తమ దొంగతనం ఆయన కనిపెట్టారని వాళ్లనుకోలేదు.“లేదండి – ఈత ప్రాక్టీసు…” అంటూ నసిగాడు రామనాథం.“ఒరే సత్యహరిశ్చంద్రా! ఈత ప్రాక్టీసు మంచిదేగాని, ఆ తోటగలాయన వెంటబడ్డాడంటే కాళ్లు విరగొడతాడు. అప్పుడు ఈత దెబ్బతింటుంది.”మెతని హాస్యం మాస్టారిది. పొడిచి బాధ పెట్టడు. అతి తాపీగా ప్రతి అక్షరం మెత్తగా ఉచ్చరిస్తూ మాట్టాడేవారాయన.“ఏవిటోయ్? కెప్టెన్ రావేనా? అంతమెత్తగా ప్రతి అక్షరం ఉచ్చరిస్తున్నావేమిటి?” అని అడిగాడు ఫోన్ లో కెప్టెన్ రెడ్డి. రావు తనలో తను నవ్వుకున్నాడు, హెడ్ మాస్టారి లాగ అనుకోకుండా మాట్లాడినందుకు. హెడ్ మాస్టారిని అనుకరించాడు. నాటకంలో ఒకసారి రావు ధర్మరాజు పాత్ర ధరించి అచ్చంగాఅనుకరించాడు. నాటకమయాక టీచర్లూ, స్నేహితులు అంతా ఎంతో. కాని హెడ్ మాస్టారు మాత్రం కళ్లతోటే నవ్వుతూ, “ఒరే సుబ్బులూ! (ఆయనొక్కడే సుబ్బులూ అనేవారు అతన్ని) నన్ను ధర్మరాజుని చేసేశావేవిఁట్రా? అతను వారి దొంగముండాకొడుకు” అన్నారు.“రెడ్డీ ! ఏర్ పోర్ట్ కి...

Visit the podcast's native language site